FbTelugu

మహా మృత్యుంజయ పాశుపత హోమం

కర్నూలు: కరోనా మహమ్మారి శాశ్వతంగా సమసిపోవాలని కాంక్షిస్తూ మహా మృత్యుంజయ పాశుపత హోమం శ్రీశైల క్షేత్రంలో ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 25 (40 రోజులపాటు) వరకు ఆలయంలో అర్చక వేదపండితులు ఏకాంతంగా మృత్యుంజయ మంత్ర పునఃశ్చరణ, హోమాలు, జపానుష్టాన పూజలు చేయించనున్నట్లు ఈఓ కెఎస్.రామారావు తెలిపారు. మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో ఈ హోమం చేయడం వల్ల ప్రజలందరికీ అకాల మృత్యుదోష నివారణ కలుగుతుందని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో జరిగే హోమాన్ని శ్రీశైలం టీవీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులు వీక్షించవచ్చని ఆయన వెల్లడించారు.

అదేవిధంగా రుద్రవనంలో శంకర జయంతి రోజున ప్రతిష్ఠించిన 14 అడుగుల రుద్రమూర్తికి విశేష అభిషేకాలు చేయనున్నారు. రుద్రదేవుని చల్లనిచూపు కృష్ణానదిపై ఎప్పుడూ పడుతూ ఉండాలనే ఉద్దేశంతో పూజలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.