FbTelugu

ఎమ్మెల్సీ కి మ్యాజిక్ ఫిగర్ ఇదే…

హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం రెండో ప్రాధాన్య ఓట్లలో కావాల్సిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి మ్యాజిక్ ఫిగర్ ఓట్లు 1,68,520. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలవాలంటే కావాల్సిన ఓట్లు 55, 831, బీజేపీ అభ్యర్థి ఎన్. రామచంద్రరావు గెలవాలంటే కావాల్సిన ఓట్లు 63, 852. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 1,83,167 ఓట్లు పొందాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవాలంటే 1,83,167 ఓట్లు పొందాల్సి ఉండగా తొలి రౌండ్ లో ఆయన 1,10,840 సాధించారు. గెలవడానికి ఇంకా 72,327 ఓట్లు అవసరం. చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కు 1,83,167 ఓట్లు కావాల్సి ఉండగా తొలి రౌండ్ లో 83,290 ఓట్లు వచ్చాయి. ఇంకా 99,877 ఓట్లు వస్తే గెలుపొందుతాడు. తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ కు 1,83,167 కావాల్సి ఉండగా తొలి రౌండ్ లో 70,072 ఓట్లు రాగా, ఇంకా 1,13,095 ఓట్లు వస్తే విజయం సాధిస్తాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.