FbTelugu

సీఎం ఉద్ధవ్ పై మాఫియా ఒత్తిడి: బిహార్ డిప్యూటీ సీఎం

పాట్నా: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పై బాలీవుడ్ మాఫియా ఒత్తిడి ఉందని బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ కేసులో నిందితుల తరఫున కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ కేసును ఉధ్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. తన కుమారుడి ఆత్మహత్యపై విచారణ జరపాలని తండ్రి ఫిర్యాదు చేస్తే, బిహార్ పోలీసులు మహారాష్ట్ర వెళ్లారన్నారు. అయితే అక్కడి పోలీసులు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్ధతుతోనే ఇదంతా జరుగుతోందని, బిహారీలకు ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.

You might also like