FbTelugu

పిచ్చోళ్ల మందులు ఇస్తున్నారు: డాక్టర్ సుధాకర్

విశాఖపట్నం: తనకు అందిస్తున్న వైద్య సేవలపై నర్సీపట్నం డాక్టర్ కోలవెంటి సుధాకర్ రావు ఆందోళన వ్యక్తం చేస్తూ, విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.

మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని లేఖలో సుధాకర్ పేర్కొన్నారు. మాస్కుల విషయం నుంచి అన్ని అంశాలను లేఖలో ప్రస్తావించారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో పేర్కొన్నారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని సుధాకర్ వాపోయారు.

తన పెదవిపై వచ్చిన మార్పులు చూపిస్తూ ఫొటోలు విడుదల చేశారు. యూరిన్‌ సమస్య కూడా ఉందని లేఖలో తెలిపారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని ఆ లేఖలో సుధాకర్ వివరించారు.

dr sudhakar rao

You might also like