FbTelugu

మరియమ్మ హత్య వెనక మాదిగ ఎంపీ హస్తం: జడ్జీ రామకృష్ణ

గుంటూరు: వెలగపూడిలో మాల కులానికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య వెనకాల మాదిగ కులానికి చెందిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హస్తం ఉందని జడ్జీ ఎస్. రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు.

శుక్రవారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దళితులపై దళితులతోనే దాడులు చేయిస్తున్నారని ఆయన వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి షాడ పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ, పోలీసు వ్యవస్థను తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నారన్నారు. వెలగపూడి ఘటనపై సీబీఐ విచారణ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.