FbTelugu

ఆర్టీసీలో ఏ ఉద్యోగినీ తొలగించ లేదు: ప్రతాప్

విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీలో ఏ ఒక్క కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగినీ తొలగించడం లేదని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ స్పష్టం చేశారు. ఆర్టీసీలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై ఆర్టీసీ ఎండీ వివరణ ఇచ్చారు.

మే 22 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో 19 మంది సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని, సిబ్బంది ఆరోగ్యం భద్రతా చర్యలకు అనుగుణంగా కొన్నిమార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిపారు. వైరస్ వ్యాప్తిని ఆపడానికి కార్యాలయంలో ఉద్యోగులు “బేర్ మినిమమ్” పరిమితం చేశామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆర్టీసీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నడవడంలేదన్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణ దృష్ట్యా అవసరమైన వారిని మాత్రమే విధులకు పిలుస్తున్నట్టు తెలిపారు. సంస్థలోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిలో ఏ ఒక్కరి ఉద్యోగం రద్దు కాదని తేల్చిచెప్పారు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ అంశాన్ని మంత్రి పేర్నినాని, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి సూచనల మేరకు తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.