FbTelugu

పప్పు పేరును ఇస్మాయిల్ గా మార్చాలి

భోపాల్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పేరెత్తకుండా పప్పు భయ్యా పేరును ఇస్మాయిల్ గా మార్చాలని మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కాంగ్రెస్ నేతలకు సూచించారు.

అంతే కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ పేరును కూడా యూనిస్ గా మారిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హోషంగాబాద్ జిల్లా పేరును నర్మదాపూరం గా మార్చుతున్నట్లు తాజాగా ప్రకటించారు. హోషంగాబాద్ పేరు మార్చడాన్ని దిగ్విజయ సింగ్ తప్పుపట్టారు. తమ తప్పిదాలను గుర్తించకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే పేరు మార్పు నాటకం అని ఆయన విమర్శించారు. హోషంగ్ షా అనే పాలకుడి పేరు మీద జిల్లాకు పేరు పెట్టారని, చారిత్రక పేర్లను మార్చడం సరైందని కాదని ఆయన హితవు పలికారు.

దిగ్విజయ విమర్శలపై బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. హోషంగ్ షా ఒక దోపిడిదారు అని, హిందువు మహిళలను వేధించిన క్రూరుడు అంటూ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాలకు దోపిడిదారుడైన క్రూరుడి పేరు గురించి చెబుతారా లేదా జీవనాధారమైన నర్మదా నది గురించి చెబుతారా అని ఆయన ప్రశ్నించారు. మీ పేరును యూనిస్ గా, మీ నాయకుడి పేరును ఇస్మాయిల్ గా మార్చుకోవాలన్నారు. అప్పుడు కాని మనకు తగిన పేరు లేకపోతే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందని రామేశ్వర శర్మ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.