FbTelugu

అతిక్రమిస్తే రామనామం… గుంజీలు!

భోపాల్: లాక్ డౌన్ విధిస్తున్నా జనం రోడ్ల మీదకు వస్తుండడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. లాఠీ ఛార్జ్ చేస్తే గగ్గోలు పెడుతున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు మాత్రం విన్నూత్న శిక్షలు విధిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన పౌరులను వదిలిపెట్టడం లేదు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఉల్లంఘించిన వారి చేత రామకోటి రాయిస్తున్నారు. మండుటెండల్లో నిల్చోబెట్టి రాయించడం మూలంగా పలువురు మళ్లీ బయటకు రాకూడదని తీర్మానించుకుంటున్నారట. మరికొన్ని ప్రాంతాల్లో గుంజీలు తీయిస్తున్నారు. కప్పగంతులు వేయిస్తున్నారు. ఈ శిక్షలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిగతా వారు అనవసరంగా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.