FbTelugu

రేపటిలోగా మధుసూదన్ మృతి తేల్చాలి: హైకోర్టు

హైదరాబాద్: కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన మధుసూదన్ మృతి, అంత్యక్రియలపై రేపటిలోగా స్పష్టతనివ్వాలని హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకెళితే.. గాంధీలో చేరిన తన భర్త ఆచూకీ లేదంటూ.. గత నెల 21వ తేదీన మాధవి అనే మహిళ ట్విట్టర్ లో కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మధుసూదన్ అంత్యక్రియల వివాదంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. మధుసూదన్ చనిపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. తన భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని మాధవి ప్రశ్నించింది.

You might also like