FbTelugu

నెటిజన్లకు చురకలేసిన సనూష

సోషల్ మీడియాలో నటీమణులు తమ అందాలను ఆరబోస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లలో కొందరు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

అందచందాలు, డ్రెస్సింగ్, మేకప్, బాడీపై షాకింగ్ కలిగేలా కామెంట్లు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ సనూష పై అసభ్యమైన కామెంట్లు పెట్టారు. బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె రేణిగుంట, జీనియస్ వంటి చిత్రాల్లో నటించింది. జెర్సి చిత్రంలో జర్నలిస్టు పాత్ర పోషించింది. కరోనా మహమ్మారి తో షూటింగ్ లు లేకపోవడంతో లావు తగ్గించుకుని నాజూగ్గా తయారైంది. బాగానే ఉన్నననుకున్న సనూష సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేసింది. ఇంకేముంది నెటిజన్లు అసభ్యకర కామెంట్లు పెట్టగా, ట్రోలింగ్ కూడా అయ్యింది. నా శరీర బరువు గురించి నా కన్నా ఎక్కువగా బాధపడకండి. అలా బాధపడేవారికి ఒకటే చెబుతున్నా… నన్ను విమర్శించేందుకు ఒక వేలు చూపిస్తే, మిగిలిన వేళ్లు మిమ్మల్ని ప్రశ్నిస్తాయి. ఎదుటివారి ముందు మీరు ఎంత చక్కగా ఉన్నారో అలోచించుకోండని సున్నితంగా మందలించింది సనూష.

You might also like

Leave A Reply

Your email address will not be published.