న్యూఢిల్లీ: ఇవాళ అర్థరాత్రి పెనంబ్రల్ చంద్రగ్రహణం సంభవించనుంది. అర్థరాత్రి 11:15 గంటలకు ప్రారంభమై తెల్లవారు జాము 2.34 గంటలకు ముగియనున్నది.
ఈ గ్రహణం మొత్తం 3 గంటల 19 నిమిషాల పాటు కొనసాగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇండియాలో రాత్రి 12.54 నిమిషాలకు పూర్తి స్థాయిలో దీన్ని వీక్షించవచ్చు. ఈ ఏడాది ఇది రెండో చంద్రగ్రహణం. జనవరి 10న మొదటి చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. పాక్షిక చంద్రగ్రహణాలను కంటితో వీక్షించవచ్చు. ఈరోజు అర్థరాత్రి కన్పించే పెనంబ్రల్ చంద్రగ్రహణం బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ తో చూడటం మంచిదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.