ఢిల్లీ: దేశంలో ఇక నుంచి ప్రయాణీకులు ముందస్తు అనుమతులు, ఈ పర్మీట్లు అవసరం లేకుండా తమ వాహనాల్లో ఎక్కడికైనా వెళ్లవచ్చని కేంద్రం స్పష్టతనిచ్చింది.
జూలై 1వ తేదీ నుంచి అన్ లాక్ – 2 మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.
జూలై 31వ తేదీ వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. ప్రధానంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వచ్చి వెళ్లేవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలనుకునేవారికి ఈ పర్మిట్ల నుంచి విముక్తి కల్పించింది.
మందస్తు అనుమతి అవసరం లేదని, ఈ పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని, ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చని కేంద్రం స్పష్టం చేసింది.