FbTelugu

పుదుచ్ఛేరి గవర్నర్ పై వేటు

చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను పదవి నుంచి తప్పించి తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

పుదుచ్చేరిలో కొద్దిరోజులు గా ముఖ్యమంత్రి నారాయణ సామి, గవర్నర్ కిరణ్ బేడీ మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దీనిపై చర్చ జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వం కిరణ్ బేడీని తప్పించడంతో రాజకీయ నాయకులు షాక్ కు లోనయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.