FbTelugu

అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 15 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది.

ఆ తర్వాత మరింత బలపడి 16వ తేదీ నాటికి వాయుగు౦డ౦ తుఫాన్‌గా మారనున్నదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, వేటలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.

తుఫాన్‌ కారణంగా అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణం అనుకూలంగా మారే అవకాశం ఉంది. తుఫాన్‌తో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. వర్షాలకు అవకాశం ఉండదని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.