FbTelugu

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ఒడిశా నుంచి బెంగాల్ వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర, యానాంలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా.. కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

You might also like