FbTelugu

ప్రేమ జంట విషాదం

నెల్లూరు: మతాంతర వివాహానికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మకూరు గిరిజన కాలనీలో చోటు చేసుకున్నది.

సోమా నవీన్ (20), అయేషా (18) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇద్దరు కలుస్తునే ఉన్నారు. మైనారిటీ తీరడంతో పెళ్లి చేసుకోవాలని ఆయేషా ఒత్తిడి చేసింది. వీరి పెళ్లిని పెద్దలు వ్యతిరేకించడంతో సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఫెస్టిసైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారక స్థితిలో కొట్టుకుంటున్న వీరిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.