FbTelugu

రాపూర్ ఘాట్ లో ప్రేమికుల ఆత్మహత్య

కడప: రాపూర్ ఘాట్ లో యువతీ యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజంపేట మండలం నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన నెత్తి పూజారి, గంగాదేవి దంపతులకు కుమార్తె అంజలి అనే అమ్మాయి ఉంది. ఐదు రోజుల క్రితం నుంచి కనబడకుండా పోయిందని తల్లిదండ్రులు పెనగలూరు మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన మొలకల నారాయణ కుమారుడు బాలాజీ అనే వ్యక్తి తో కలిసి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తేలింది. తమ కుమారుడు కూడా కన్పించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇరువురి తల్లిదండ్రుల ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేస్తున్నారు.
రాపూర్ ఘాట్ లో యువతీ యువకుల మృతదేహాలు కన్పిస్తున్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వారు అక్కడికి వెళ్లి రెండు మృతదేహాలను బయటకు తీసి పరిశీలించగా అంజలి తో పాటు మరొకరు ఉన్నట్లు తేలింది. ఇద్దరూ శవమై కనపడటంతో రెండు కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి

You might also like

Leave A Reply

Your email address will not be published.