FbTelugu

యువతిపై ప్రేమోన్మాది దాడి…

విశాఖపట్నం: ఫెర్రీ జంక్షన్ సచివాలయంలో వాలంటీర్ గా పని చేస్తున్న యువతిపై ప్రేమికుడు కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత తను ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖపట్నం లోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫెర్రీ జంక్షన్ కు వాలంరటీర్ ప్రియాంకపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతును కోయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కేజీహెచ్ ఆసుపత్రిలో ఈ.ఎన్.టీ వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందుతున్నది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు.

శ్రీకాంత్ దాడి చేయడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీయగా కొత్తకోణం వెలుగు చూసింది. కొద్దిరోజులుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు ఫేస్ బుక్ తో పాటు వాట్సప్ లో కన్పించడంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.