FbTelugu

ఒకే అమ్మాయిని ప్రేమించారు… ఆత్మహత్య చేసుకున్నారు!

జైపూర్: ఒకే అమ్మాయిని ప్రేమించిన దాయాదులకు ఏం జరిగిందో ఏమో కాని పరుగెత్తుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారక ఘటనపై స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

బుండి జిల్లా కేవవపుర గ్రామంలో మహేంద్ర గుర్జర్ (23), దేవరాజ్ గుర్జర్ (23) లు దాయాదులు. ఇద్దరూ ఆశా అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. అంతే కాకుండా తమ చేతులపై ఆశా అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఏమైందో ఏమో కాని గుడ్లా గ్రామానికి సమీపంలో పరుగెత్తుతున్న రైలు ముందుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలికి రైల్వే పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.