FbTelugu

స్నేహితుని చెల్లితో ప్రేమ.. అడ్డుగా ఉన్నాడని హత్య

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అమ్మాయి ప్రేమకోసం ప్రాణ స్నేహితున్నే హతమార్చాడో యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాసిన్, సాయి అనే ఇద్దరు యువకుడు స్నేహితులు. స్నేహం ముసుగులోనే సాయి చెల్లితో యాసిన్ ప్రేమ వ్యవహారం నడిపాడు.

విషయం తెలుసుకున్న సాయి యాసిన్ ను పలుమార్లు మందలించాడు. తన ప్రేమకు సాయి అడ్డువస్తున్నాడని భావించిన యాసిన్ సాయి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అదును చూసి సాయికి విషమిచ్చి హతమార్చాడు. నిందితుడు యాసిన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు.

You might also like