FbTelugu

కదులుతున్న రైళ్లో ప్రేమ పెళ్లి

పాట్నా: కదులుతున్న రైలులోనే ఒక నవ వధువు ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన బిహార్ లోని సుల్తాన్ గంజ్ రైల్వే స్టేషన్ లో జరిగింది.
అనుకుమారి, ఆషు కుమార్ లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

ఇది నచ్చని అమ్మాయి తరఫు తల్లిదండ్రులు రెండు నెలల క్రితం కిరణ్ పూర్ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి చేయించారు. ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నా, రెండో రోజే అతని ఇంటి నుంచి పారిపోయి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె ఆషఉ కుమార్ ను సుల్తాన్ గంజ్ రైల్వే స్టేషన్ లో కలిసింది. ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కారు. కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని రైల్లో చెప్పింది. ఆషు కుమార్ ఆమె నుదుట సింధూరం దిద్డాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా వరుడు కుటుంబ సభ్యులు, ఆమె తల్లిదండ్రుల కంటపడ్డాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.