FbTelugu

హైదరాబాద్ లో లవ్ జిహాదీ దారుణం

హైదరాబాద్: తమ సెలూన్ కు వస్తున్న ఒక యువతిపై అందులో పనిచేస్తున్న వ్యక్తి కన్నేశాడు. పెళ్లి కాలేదని నమ్మించి ఆమెను ప్రేమించి, పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. పెళ్లైన విషయం తెలిసిన తరువాత యువతి దూరం పెట్టడంతో అంతమొందించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు.
యువతి ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇది ముమ్మాటికి లవ్ జిహాదీ అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి నార్సింగి పోలీసుల విచారణలో విస్తుగొల్పే అంశాలు వెలుగు చూశాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన షారూఖ్ సల్మాన్ (23) రెండేళ్లుగా సన్ సిటీలో ఉన్న జావెద్ హబీబ్ సెలూన్ లో పనిచేస్తున్నాడు. ఇదే సెలూన్ కు ఒక హిందూ యువతి తరచూ వెళ్తుండేది. ఆ యువతిని సల్మాన్ పరిచయం చేసుకుని, క్రమంగా ప్రేమ నాటకం మొదలు పెట్టాడు. యువకుడు కూడా నచ్చడంతో ముస్లిం అయినా పెళ్లి చేసుకునేందుకు యువతి సిద్ధమైంది. ఈలోపు అతనికి పెళ్లైన విషయం వెల్లడికావడంతో హతాషురాలైన యువతి దూరంగా ఉండడం మొదలు పెట్టింది.

యువతిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి లేదా అంత మొందించాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడు. వేరే వ్యక్తితో వివాహం చేసుకునేందుకు సిద్దపడినట్లు తెలియడంతో సల్మాన్ రగిలిపోయాడు. మంగళవారం రాత్రి మాట్లాడాల్సి ఉంది రావాలని కోరడంతో ఆమె అపార్ట్ మెంట్ కిందకు వచ్చింది. తనను కాదని వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ప్రశ్నించాడు. రెండో భార్యగా చేసుకుంటాను, రావాలని ఒత్తిడి చేశాడు. అయినా కాదనడంతో తట్టుకోలేకపోయిన సల్మాన్ ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న షారూఖ్ సల్మాన్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.