FbTelugu

ప్రేమజంట విషాదాంతం

ఆసిఫాబాద్: లింగాపూర్ మండలం మామిడిపల్లిలో ప్రేమికుల జంట బలవన్మరణానికి పాల్పడింది. అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది.
మామాడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీమ్ రావు (22), జైనూరు మండలం రాశిమెట్ట గ్రామానికి చెందిన మడావి విజయ(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ దరుణానికి ఒడిగట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మృతదేహాలను గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం పంపించారు.

You might also like