FbTelugu

ప్రేమ, సహజీవనం… మొహం చాటేశాడు

ఖమ్మం: ఒక యువతిని ప్రేమించి, సహజీవనం చేసి, పెళ్లి ప్రస్తావన తేగానే తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని తప్పించుకున్నాడు. ప్రియుడి నిజ స్వరూపం తెలిసిన ప్రియురాలి అతని ఇంటి ముందే దీక్షకు కూర్చున్నది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బోనకల్ మండలం రావినూతలకు చెందిన వేణు (22) అదే మండలం చిరునోములకు చెందిన సింధు (21) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం సింధూను వరంగల్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగిగా చేర్పించాడు. ఇద్దరు కలిసి సహజీవనం చేయసాగారు.

పని ఉందని చెప్పి వేణు రావినూతలకు వచ్చాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సింధూ కూడా రావినూతలకు వచ్చింది. పెళ్లి విషయం ప్రస్తావించగా, తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని సమాధానం ఇచ్చాడు. తాను మోసపోయానని గమనించిన ఆమె తన ప్రియుడి ఇంటి ముందే దీక్షకు కూర్చున్నది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎస్.ఐ కొండల్ రావు రావినూతలకు చేరుకుని న్యాయం చేస్తానని సింధూ కు నచ్చచెప్పి దీక్ష విరమింప చేయించాడు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.