FbTelugu

పక్కా ప్లాన్ తో ప్రియుడి అంతం

బెంగళూరు: తనకు దూరమై, ప్రియుడితో సంసారం చేస్తున్న భార్యను కట్టడి చేసేందుకు ఒక భర్త హంతకుడిగా మారాడు. భార్య, ప్రియుడు పడుకున్న మంచం కింద దాక్కున్న భర్త అదును చూసి ప్రియుడిని కత్తితో నరికేశాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏడేళ్ల క్రితం భరత్ కుమార్ (31) వినుత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం కలిగారు. మూడు సంవత్సరాల క్రితం శివరాజ్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చాడు. కొద్ది రోజుల క్రితం శివరాజ్ తన ప్రేమ ప్రతిపాదనను వినుత ముందు పెట్టాడు. ఈ ప్రతిపాదనకు వినుత ససేమిరా అనింది. ప్రేమను నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డంతో అంగీకరించక తప్పలేదు. ఇద్దరు కలిసి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని భర్త భరత్ గుర్తించాడు. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో బైడరహల్లిలోనే మరో ఇంట్లో వినుత ఉంటోంది. శివరాజ్ వారంలో రెండు మూడు రోజులు వచ్చి వెళ్లుంటాడు.

ఈ విషయం తెలుసుకున్న భర్త భరత్, బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో వినుత చికెన్ మాంసం కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. ఇంట్లోకి వచ్చి మంచం కింద చొరబడ్డాడు. రాత్రి ప్రియుడు శివరాజ్, వినుత ఇద్దరు కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారు జాము 3 గంటల ప్రాంతంలో వినుత బాత్రూమ్ కు వెళ్లింది. ఆ వెంటనే భరత్ మంచం కింది నుంచి బయటకు వచ్చి వినుత బాత్రూమ్ కు తాళం వేశాడు. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో శివరాజ్ ను హత్య చేశాడు. భరత్ ను పోలీసులు అరెస్టు చేసి, వైద్య పరీక్షలు చేయించారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.