FbTelugu

రూ.40 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారీ

గుంటూరు: గత పదిహేను సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తూ ప్రజల నమ్మించిన వ్యక్తి రూ.40 కోట్లతో పరారీ అయ్యాడు. పరారీ అయిన వ్యక్తిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నరసరావుపేట పట్టణం రామిరెడ్డిపేటకు చెందిన తాడికొండ చంద్రశేఖర్‌ గత 15 ఏళ్లుగా చిట్ ఫండ్ నిర్వహిస్తున్నాడు. పాట పాడిన తరువాత చెప్పిన తేదీకి సొమ్ము తిరిగి చెల్లిస్తాడనే పేరు ఉంది. నమ్మకంగా ఉండడం, మాట ప్రకారం డబ్బులు ఇస్తుండడంతో పలువురు పెద్దసంఖ్యలోనే చిట్టీలు వేసేవారు. గత 13 రోజులుగా అతను నివాసం ఉండే ప్లాట్‌ కు తాళాలు వేసి ఉండడంతో పారిపోయాడని బాదితులు గ్రహించారు. తాము నిండా మోసపోయినట్లు గ్రహించి ఒకటో టౌన్ పోలీసు స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. తమకు చిట్టీ వ్యాపారి రూ.40 కోట్లకు పైగా బాకీ పడినట్లు బాధితులు తెలిపారు. ఇంతకు ముందు ఆయన లాటరీ టిక్కెట్ల విక్రయంతో పాటు క్రికెట్‌ బెట్టింగులకు సంబంధించిన బోర్డు నిర్వహించేవాడని బాధితులు పోలీసులకు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.