FbTelugu

3 రాజధానులతో నష్టం ‘సీమ’కే: అఖిల ప్రియ

అమరావతి: ఏపీలో మూడు రాజధానుల వలన ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రాంత వాసులేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ అని చెబుతూనే విశాఖకి, విజయవాడకి హైకోర్టు బెంచ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టు ఇస్తున్నారంటే పార్టీలకు అతీతంగా తాము స్వాగతిస్తామన్నారు. అయితే హైకోర్టుతో పాటూ ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్ లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి సీమలోని ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు నోరు విప్పాలనన్నారు.

You might also like