FbTelugu

హోలీ వ్యాపారులకు రూ.35వేల కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు ఆర్థికంగా కూనారిల్లుతుండగా హోలీ రంగుల వ్యాపారం చేసే వర్తకులపై కూడా ఆ ప్రభావం పడింది. కరోనా సెకండ వేవ్ కారణంగా హోలీ పండుగపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో హోలీ ఆడలేకపోయారు.

ఫలితంగా విక్రయాలు జరగ్గా స్టాక్ అలాగే ఉండిపోయింది. దీంతో వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. దేశం లో ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా చిన్నా పెద్ద వ్యాపారులు రూ.50వేల కోట్ల వరకు ఆర్జించేవారు. రంగులు, తిను భండారాలు, మిఠాయిలు, డ్రై ఫ్రూట్లు, కుర్తా పైజామా, చీరలు, జాకెట్లు, గిఫ్ట్ ప్యాక్ లు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు, స్టీలు పాత్రలు పెద్ద ఎత్తున విక్రయించేవారు. వీటితో పాటు కర్పూరం, కొబ్బరి, పత్తి అమ్మకాలు జరిగేవి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హోలీ ఘనంగా చేసుకుంటారు. యావత్ కుటుంబం రెండు రోజుల పాటు వైభవంగా జరుపుకుంటుందని, ఆంక్షల కారణంగా దూరంగా ఉన్నారని కాన్ఫెడరేషన్ ఆప్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధ్యక్షుడు ప్రవీణ్ కండేవాల్ తెలిపారు. ఫలితంగా రూ.35వేల కోట్ల ఆదాయం కోల్పోయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.