FbTelugu

అడ్వకేట్ కారును ఢీకొట్టిన లారీ

జనగామ: యశ్వంతాపూర్ వ్ద వద్ద హైకోర్టు అడ్వకేట్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. అడ్వకేట్ దుర్గాప్రసాద్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వస్తుండగా ఘటన చోటు చేసుకున్నది.
దుర్గాప్రసాద్ హైకోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్-జనగామ హైవే లో కారును ఒక లారీ డ్రైవర్ వెంబడించి యశ్వంతపూర్ వద్ద ఢీ కొట్టాడు.

ఢీ కొట్టడమే కాకుండా 500 మీటర్ల దూరం వరకు కారును లాక్కెల్లాడు. స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని నిలదియగా బ్రేక్ ఫెయిల్ అయిందని పొంతన లేకుండా సమాధానం ఇచ్చాడు. వరంగల్ కోర్టులో హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలు దేరాడు. ఘటనను గమనిస్తే అడ్వకేట్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగినట్లు స్పష్టమవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.