FbTelugu

రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న లారీ

Lorry-killing-a-woman-crossing-the-road

హైదరాబాద్: రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సాగర్ రింగ్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజమ్మ అనే మహిళ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వస్తున్న పాల లారీ ఢీకొట్టింది. దీంతో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags:
You might also like