FbTelugu

బైక్ ను లారీ ఢీకొని దంపతులు మృతి

రంగారెడ్డి: బైక్, లారీ ఢీకొని దంపతులు మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని కొత్తూరు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక కొత్తూరు సమీపంలో వేగంగా వచ్చిన ఓ లారీ బలంగా బైకును డీకొట్టింది.

ఈ ఘటనలో బైక్ వెళుతున్న ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like