FbTelugu

పనికెళ్తున్న భార్యాభర్తలను ఢీకొన్న లారీ..

Lorry-collides-with-a-working-husband

విశాఖపట్నం: నడుచుకుంటూ వెళుతున్న భార్యాభర్తలను లారీ ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన ఘటన జిల్లాలోని కసింకోట మండలం, తాళ్లపాలెం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున వారు పొలం పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమినాయుడు (55), కరణం పైడితల్లి( 50) గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like