FbTelugu

లారీ బోల్తా.. ఐదుగురు మృతి

చిత్తూరు: బోరు లారీ బోల్తాపడి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జిల్లాలోని పెద్దతిప్పసముద్రం- కర్ణాటక సరిహద్దులో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఓ బోర్ వెల్ లారీ ప్రమాదవ శాత్తు పెద్దతిప్పసముద్రం- కర్ణాటక సరిహద్దులో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అందులోని ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనాయి. మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like