FbTelugu

ఆటో, లారీ ఢీకొని ఐదుగురు దుర్మరణం

చిత్తూరు: ఆటో, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని పీలేరు నుంచి కొత్తగాండ్లపల్లెకు వెళుతుండగా.. స్థానిక సొరకాయలపేట చెరువు కట్ట వద్ద చోటుచేసుకుంది.

వివరాలోకెళితే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ బంధువైన యువకుని కడచూపుకు ఆటోలో వెళ్లి వస్తుండగా.. స్థానిక సొరకాయలపేట చెరువు కట్ట వద్ద ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్వతమ్మ, సుజనమ్మ, రెడ్డి గోవర్ధిని, వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. దామోదర అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like