FbTelugu

క‌రాచీ బేకరీ లూటీ

ఢిల్లీ: మొజాంజాహీ మార్కెట్ లోని కరాచీ బేకరీ లో దొంగలు ప్రవేశించి నగదు లూటీ చేశారు.

ఇక్కడి నుంచి కరాచీ బేకరీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. పక్కనే పోలీసు చెక్ పోస్టు ఉన్నప్పటికీ దొంగలు తమ పని కానిచ్చేశారు. బుధవారం ఉదయం బేకరీని తెరిచారు. లాకర్ లో సుమారు రూ.10 లక్షల నగదు లేకపోవడంతో యజమానులు గాబరా పడ్డారు. లాకర్ పగులగొట్టి ఉండడంతో యజమానులు షాక్ కు లోనయ్యారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. భవనం మధ్యనున్న చిన్న సందు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి దొంగలు పని అయి ఉంటుందనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

You might also like