FbTelugu

నకిలీ ఈ మెయిల్ తో లక్షలు లూటీ

ఖాతాదారుడిని అడగకుంటానే నగదు బదిలీ
హైదరాబాద్: నగరానికి చెందిన బండారి వీరేంద్ర అనే వ్యాపారి పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఈ మెయిల్ సృష్టించారు. తను కరోనా పాజిటివ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నానని.. అర్జెంట్ గా పేరుతో రూ.23.60 లక్షల ఆన్ లైన్ లో పంపించాలని కేటుగాళ్లు ఈ మెయిల్ పంపించారు. వీరేంద్ర ప్రమేయం లేకుండానే నకిలీ లెటర్ ప్యాడ్ పై ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి బేగంపేట యాక్సిస్ బ్యాంక్ కు మెయిల్ పంపించారు. సంతకం ఒకేరకంగా ఉండడం, లెటర్ హెడ్ పై పంపిచండంతో వారు చెప్పిన విధంగా మూడు అకౌంట్లకు రూ.23.60 లక్షలు బ్యాంకు అధికారులు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారు. సాయంత్రం అకౌంట్ చెక్ చేసి డబ్బులు తక్కువ ఉండడంతో వీరేంద్ర కంగుతిన్నాడు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో మోసంలో రూ.5 లక్షలు బదిలీ…
ఇదే తరహాలో మరో మోసం చోటు చేసుకున్నది. తాను హాస్పటల్ లో ఉన్నానని, తన బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు అర్జెంటుగా బదిలీ చేయాలని సైబర్ చీటర్స్ నకిలీ లెటర్ పై సంతకం చేసి కొటక్ మహీంద్ర బ్యాంకు కు పంపించారు. లెటర్ హెడ్ పరిశీలించిన కొటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు వారు చెప్పిన ఖాతా కు రూ.5 లక్షలు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారు. తనకు తెలియకుండానే సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు ఖాతాదారుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకులు ఖాతాదారుడికి ఫోన్ చేయకుండానే నగదు బదిలీ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.