FbTelugu

ఇక ఓటీటీ యాప్స్ రాజ్యం

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత కూడా ఓటిటీ ప్రభావం తగ్గదని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. సినిమా థియేటర్లు తెరిచిన తరువాత దీని ప్రభావం తగ్గుతుందనడం సరికాదని ఆయన అన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రారంభించిన ఓటీటీ యాప్ ను 40 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, స్పందన బాగా ఉందన్నారు. ఇందులో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్, ప్రతేకమైన షోలను తీసుకువస్తున్నామన్నారు. థియేటర్లు తెరిచిన తరువాత ఓటిటి కార్యకలాపాలను తగ్గిస్తారా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, లేదని అల్లు అరవింద్ సూటిగా సమాధానమిచ్చారు.

ఆహా యాప్ కోసం అనేక ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. భవిష్యత్తులో దేనికదేనంటూ వివరించారు. ఇకముందు వారాంతం మాత్రమే జనం థియేటర్లకు వచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయని, మిగతా రోజుల్లో యాప్ ల ద్వారా తమకు నచ్చిన వాటిని వీక్షిస్తారని అరవింద్ వెల్లడించారు.

You might also like