FbTelugu

ఇక గ్యాస్ బుకింగ్ ఎంతో సులభం

* ఒక్క మిస్డ్ కాల్ తో బుకింగ్

భువనేశ్వర్: గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ శుభవార్త మీకోసమే.. ఇక నుంచి ఇండేన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఒక్క మిస్డ్ కాల్‌ ఇచ్చి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

తాజాగా ఈ సదుపాయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రారంభించారు. ఇందుకుగాను వినియోగదారులు 84549 55555 నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.