అమరావతి: విశాఖలో సాయినార్ లైఫ్ సైన్సెస్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యక్తం చేశారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరం అన్నారు. ఇద్దరు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఘటన పై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.