FbTelugu

వైకాపా దెబ్బకి నిర్మాణరంగం కుదేలైంది: లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఇసుక మాఫియా దెబ్బకి నిర్మాణ రంగం కుదేలయ్యిందని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. సొంతపార్టీ నేతలే ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని అంటున్నారని అన్నారు.

కోవిడ్ రూల్స్ ని సైతం రాజకీయం కోసం వాడుకోవడం ఒక్క జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి రెండోసారి ఆపరేషన్ జరిగి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పాక కూడా అర్థరాత్రి బలవంతంగా డిశ్చార్జ్ చేసి, అదుపులోకి తీసుకోవాలనే కుట్ర చూస్తుంటే ప్రభుత్వం ఆయన ప్రాణాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుమానంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.