FbTelugu

ఎస్పి అమ్మిరెడ్డి కులపిచ్చి పోలేదా?: లోకేష్ ఫైర్

గుంటూరు: అర్బన్ ఎస్పి ఆర్ఎన్.అమ్మిరెడ్డి ను లక్ష్యంగా చేసుకుని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ చేశారు. తాడేపల్లిలో సిఎం జగన్ రెడ్డి ఇంటి దగ్గర పనిచేయాలని అంతగా ఉత్సాహం, రెడ్డి కుల పిచ్చి ఉంటే పవిత్రమైన ఆ ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోవాలని మండిపడ్డారు.

ఎస్పి ఆర్ఎన్.అమ్మిరెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుని, తాడెపల్లి కొంపకు చాకిరి చేయడానికి సిగ్గులేదా అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని అంతర్జాతీయ ఉగ్రవాదులు మాదిరి అరెస్టు చేసినట్లు ఏంటా ఓవరాక్షన్ అని మందలించారు. ఇవే వీడియోలు టిడిపిపై పెట్టిన వారిపై మా పార్టీ పెట్టిన కేసుల్లో ఇప్పటి వరకు ఎన్నింట్లో అరెస్టు చేశారని ప్రశ్నించారు. మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పై కేసు పెట్టడానికి వచ్చిన వారిపైనే రివర్స్ కేసు బనాయించారని లోకేష్ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.