అమరావతి: విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్లని పట్టుకోవడం చేతకాక ప్రభుత్వం అక్రమంగా టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రామతీర్థానికి వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై కొందరు దాడి చేసిన కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళావెంకట్రావును పోలీసులు అరెస్టు చేయడం పట్ల లోకేశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేతిలో అధికారం ఉందని ఇంకెంత మందిని అక్రమంగా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు సౌమ్యుడైన కళా వెంకటరావును అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు.