FbTelugu

జగనే.. శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్: లోకేష్

lokesh-fires-on-ycp-govt-in-ap

అమరావతి: జగనే శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని జగన్ అనడంతో లోకేష్ ట్వట్టర్ వేదికగా జగన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. జగన్ తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టే ఉందని అన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం ఇప్పటికైనా మానుకోండంటూ హితవు పలికారు. జగన్ కి చేతనైతే వైకాపా నేతల ఇసుక అక్రమరవాణా అడ్డుకొని, సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. జగన్ అసమర్థతవల్ల కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని, కాకినాడలో వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చేలోపే మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మాని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

You might also like