FbTelugu

జగన్ కు పడగొట్టడమే తెలుసు: లోకేశ్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పడగొట్టడం తప్ప నిలబెట్టడం తెలియదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ విశాఖలో గీతం యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేయడం పట్ల ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విమర్శలు కురిపించారు.

మొన్న సబ్బం హరి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీలో ఇదే తంతు జరిగిందన్నారు. జగన్ విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.