FbTelugu

ఏపిపిఎస్సీ కాదది వైసిపి పిఎస్సి: లోకేష్ బాబు

అమరావతి: గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థుల జీవితాలను సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నాడని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు విమర్శించారు. ఏపిపిఎస్సి ని  వైసిపి పిఎస్సి గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

గ్రూప్-1 అభ్యర్థులతో జరిగిన చర్చా కార్యక్రమంలో నారా లోకేష్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపిపిఎస్సి ద్వారా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల పేపర్ లీకేజ్, ఉద్యోగాలు అమ్ముకోవడం చూశామన్నారు. కనీస విద్యార్హత లేని వారు,రాజకీయలకు సంబంధం ఉన్నవారు, ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్న అధికారుల బంధువుల ని ఏపిపిఎస్సి లో నియమిస్తున్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న సర్వీసు కమిషన్ ఛైర్మన్ ఆఫీస్ కి తాళం వేసిన మూర్ఖుడు జగన్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న ఛైర్మన్ అక్రమాలు చెయ్యడానికి, ఉద్యోగాల అమ్మకానికి అడ్డొస్తారు అనే జాబ్స్ క్యాలెండర్ విడుదల చెయ్యడం లేదని దుయ్యబట్టారు. లక్షలమంది యువత పోటీ పడే గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించడానికి మీరు పడే కష్టం నాకు తెలుసు అని అభ్యర్థులతో అన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు ఎంతో శ్రద్దగా చదువుకుంటారు. గ్రూప్-1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా వచ్చిన ఇతర ఉద్యోగాలని సైతం వద్దనుకునేవారు ఉంటారు. 2018లో జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు  మెయిన్స్ రాత పరీక్ష గత ఏడాది డిసెంబర్ లో జరిగింది. ఈ ఏడాది  ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. దాదాపు 9,678 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ రౌండ్‌కు స్పోర్ట్సు కోటా తో కలిపి 340 మంది ఎంపికయ్యారు. పరీక్షలకు సంబంధించిన వాల్యూష‌న్‌ సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చాయని లోకేష్ అన్నారు.

ఎంపిక విధానం గతంలో జరిగిన ప్రక్రియకు విరుద్ధంగా ఉంది. ఎలాంటి అధ్యయనం లేకుండా  డిజిటల్ వాల్యూష‌న్‌ని ఎంచుకోవటం అనేక విమర్శలకు తావిస్తోంది. మాన్యువల్ వాల్యూష‌న్ చేయ‌డం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోతున్నారు. గైడ్ లైన్స్ లో మాన్యువల్ అని ఉంటే మధ్యలో డిజిటల్ వాల్యూష‌న్ కి ఎందుకు వెళ్లారు? వాల్యూష‌న్ ఎక్కడ జరిగింది? అసలు ఏ  విధానం ఫాలో అయ్యారు? చెప్పడం లేదు. మెయిన్స్ జవాబు ప‌త్రాల‌ను మాన్యువ‌ల్ వాల్యూష‌న్‌ చేయాలి. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అంద‌రి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలి. ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఎంపిక ప్రక్రియ, వాల్యూష‌న్‌పై అనుమానాలున్న‌వారి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మీకు న్యాయం జరిగే వరకూ నేను అండగా ఉంటా.మీరు చేస్తున్న న్యాయ పోరాటం లో నేను భాగస్వామ్యం అవుతానని లోకేశ్ హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.