FbTelugu

ఎపిపిఎస్‌సి అక్రమాలపై లోకేష్ ఆగ్రహం

అమరావతి: గత ఏడాది ఎపిపిఎస్‌సి పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.

తొందరపాటు చర్యలతో పరిశీలన లేని డిజిటల్ మూల్యాంకనం, అభ్యర్థుల ఏకపక్ష ఎంపిక, డిజిటల్ పద్దతిలో పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం వలన అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఇది 6వేల మంది పైచిలుకు అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదు. భవిష్యత్ నిర్వాహకులను ఎన్నుకునే  విశ్వసనీయత వ్యవస్థ ఎపిపిఎస్‌సి అని గుర్తించాలిని లోకేష్ పేర్కొన్నారు. పొరపాట్లు, మూల్యాంకనం లోపాలను తక్షణమే సరిదిద్ది అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ తప్పులను సరిదిద్దకుంటే మరో పోరాటానికి సిద్ధం అవుతామని లోకేష్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.