FbTelugu

ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: ఎంపి మిథున్ రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ లోకసభ పక్షం నేత పి.మిథున్ రెడ్డి ఆరోపించారు. టిడిపి నేతలు అరెస్టు అయినా రాష్ట్రపతికి ఎన్.చంద్రబాబు నాయుడు లేఖ రాయలేదని, వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు విషయంలో ఎందుకు రాశారని ఆయన ప్రశ్నించారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఎంపి రఘురామ కృష్ణమ రాజు నడుచుకుంటున్నారని ఆయన అన్నారు. ఏసి సిఐడి అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు కాని కొట్టలేదని, హింసించలేదని, ఎంపి గా ఎంతో గౌరవించారని మిథున్ రెడ్డి వివరించారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని హైకోర్టుకు మెడికల్ రిపోర్టు కూడా ఇచ్చారన్నారు. తనను సిఐడి పోలీసులు కొట్టారని రఘురామ కుట్ర చేస్తున్నారని, బెయిల్ రాలేదని తెలిసే ఈ డ్రామాలు అని ఆయన ఎద్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.