FbTelugu

విదర్భలో లాక్ డౌన్

ముంబయి: కరోనా వైరస్ విదర్భ ప్రాంతంలో మరోసారి విజృంభిస్తున్నది. కేసులు పెరుగుతుండడతో అప్రమత్తమైన ప్రభుత్వం యావత్మల్ జిల్లాలో ఆంక్షలు విధించింది.

కేసులను తగ్గించేందుకు ఈ నెల 20వ తేదీ శనివారం రాత్రి 8 నుంచి 22వ తేదీ ఉదయం 7 గంటల వకు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నామని తెలిపారు. రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో వేడుకలు తగ్గించుకోవాలని, 50 శాతం పరిమితి దాటవద్దని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా సరే ఐదు మంది మించకుండా గుమికూడవద్దని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.