FbTelugu

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తారా!?

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తారా అంటే అవుననే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. లాక్ డౌన్ మరో వారం రోజులు పొడిగించలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం.

వైద్యశాఖ ఇచ్చిన సలహా మేరకు పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అదే గనుక జరిగితే జూన్ 7వ తేదీ వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరు వరకే లాక్ డౌన్ అమలు చేసి, ఆ తరువాత నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు. అది కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలు చేయాలనే యోచనకు వచ్చారు. అయితే వ్యాక్సిన్లు అందుబాటులో లేని కారణంగా లాక్ డౌన్ ఎత్తేయకూడదని, ఒకవేళ ఎత్తివేస్తే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. గ్లోబల్ టెండర్ కు ఎంత మంది ముందుకు వస్తారనేది తెలియాల్సి ఉంది. పంజాబ్ రాష్ట్రం కూడా గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేయడం కుదరదని పలు వ్యాక్సిన్ కంపెనీలు స్పష్టం చేశాయి. తెలంగాణ విషయంలో కూడా ఈ రీతిగానే స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.