FbTelugu

19 తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 19వ తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా అంటే అవుననే విధంగా సంకేతాలు ఉన్నాయి. ఈ నెల 19 వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో లాక్ డౌన్ ఆంక్షలు పూర్తి ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. కేసులు పూర్తిగా తగ్గినందున ఆంక్షలు ఎత్తివేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంక్షలపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఆంక్షలు తొలగించాలని మిత్రపక్షం ఎంఐఎం కూడా ఒత్తిడి చేస్తున్నది. గతంలో మాదిరి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ విధించే సూచనలు కూడా ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.